News September 2, 2024
BIGBOSSలోకి వరంగల్ యువకుడు
ప్రముఖ రియలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 ఆదివారం మొదలైంది. ఇందులో వరంగల్‌కు చెందిన నబీల్ అఫ్రిది చోటు దక్కించుకున్నాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంతే ఇష్టం. కాగా, నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూజ్ ఛానల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.
Similar News
News September 20, 2024
వరంగల్ మార్కెట్లో పసుపు, పల్లికాయ ధరలు ఇలా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సూక పల్లికాయ(పాతది) ధర రూ.6వేలు పలకగా, సూక పల్లికాయ(పచ్చిది) రూ.5,780, పచ్చి పల్లికాయ రూ.4, 600 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి రూ.14,000 ధర, పసుపుకి రూ.11,859 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా, నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయి.
News September 20, 2024
BREAKING.. వరంగల్ రైల్వే స్టేషన్లో NO STOP
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 39 రైళ్లకు SEP 25 నుంచి 28 వరకు నో స్టాప్ వర్తిస్తుందని HYD సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. హసన్‌పర్తి, కాజీపేట, వరంగల్, విజయవాడ-వరంగల్ మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు ట్రైన్లకు కాజీపేట ఆల్టర్నేటివ్ స్టాప్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు.
News September 20, 2024
వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి: అదనపు ఎస్పీ
MHBD జిల్లా పరిధిలోని సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను అడిషనల్ ఎస్పీ చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు వాహనాలను నిరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.