News June 19, 2024
బిహార్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటన.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే?

బిహార్‌లో ప్రారంభించక ముందే కుప్పకూలిన బ్రిడ్జి <<13463723>>ఘటన<<>>పై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం స్పందించింది. ఆ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించిందని స్పష్టం చేసింది. దీంతో పలువురు కేంద్ర మంత్రిపై విమర్శలకు దిగారు. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని గుర్తు లేదా అని కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News January 14, 2026
గొంతులు కోసిన చైనా మంజా.. ఇద్దరి మృతి

వేర్వేరు ఘటనల్లో చైనా మాంజా ఇద్దరి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని సంగారెడ్డి(D) ఫసల్వాదిలో బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో సంజూకుమార్ అనే వ్యక్తి ఇదే తరహా ఘటనలో మరణించాడు. కాగా చైనా మాంజా వినియోగం, విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది.
News January 14, 2026
ఢిల్లీ కాలుష్యం.. తప్పుకున్న వరల్డ్ నం.3

ఢిల్లీలో కాలుష్యం ఆటలపై ప్రభావం చూపిస్తోంది. తీవ్రమైన కాలుష్యం కారణంగా ‘ఇండియా ఓపెన్’ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వరల్డ్ నం.3, డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ ఆంటన్సెన్ ప్రకటించారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. దీంతో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 5వేల డాలర్ల ఫైన్ చెల్లించారు. కాగా ‘ఇండియా ఓపెన్’ నుంచి ఆండర్స్ తప్పుకోవడం ఇది వరుసగా మూడోసారి.
News January 14, 2026
వెంటనే ఇరాన్‌ను వీడండి.. భారతీయులకు ఎంబసీ సూచన

ఇరాన్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలని, ఎంబసీతో కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపింది. సాయం కోసం ఫోన్ నంబర్లను, మెయిల్(cons.tehran@mea.gov.in )లో సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్టర్ కాని వారు అధికారిక <


