News April 30, 2024

బర్త్‌డే రోజు నిరాశే..!!

image

రోహిత్ శర్మ పుట్టినరోజు నాడు స్పెషల్ ఇన్నింగ్స్ చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇవాళ లక్నోపై 4 పరుగులకే వెనుదిరిగారు. గత 5 పుట్టినరోజుల నాడు రోహిత్ స్కోర్లు చూస్తే 17 vs DC, 2009, 1 vs SRH, 2014, 2 vs RR, 2022, 3 vs RR, 2023, 4 vs LSG, 2024గా ఉన్నాయి.

Similar News

News December 16, 2025

రుషికొండ ప్యాలెస్ కోసం టాటా, లీలా గ్రూపుల ప్రతిపాదనలు

image

AP: విశాఖ రుషికొండ భవనాలపై <<17985023>>GOM<<>> చర్చించింది. ‘ఈ భవనాలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్, లీలా ప్యాలెస్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వచ్చేవారం మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని మంత్రి కేశవ్ తెలిపారు. కాగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆదాయం పెరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ చెప్పారు.

News December 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 98 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: భీముడు ఈ వీరుడితో 27 రోజులు పోరాడతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి, వేర్వేరు దిక్కులకు పడేస్తాడు. ఈ విధంగా అస్తమించిన మహాభారత పాత్ర ఎవరిది?
సమాధానం: జరాసంధుడు
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 16, 2025

చంద్రబాబు ఇచ్చిన DSC నోటిఫికేషన్‌తో టీచర్ అయ్యా: హోంమంత్రి

image

AP: చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి ఏడాది డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హోంమంత్రి అనిత తెలిపారు. ‘చంద్రబాబు 2002లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌తో నేను టీచర్ అయ్యాను. ఇప్పుడు ఆయన క్యాబినెట్‌లోనే మంత్రిగా ఉండటం నా అదృష్టం. పోలీసు యూనిఫామ్ పవర్ కాదు.. బాధ్యత. కానిస్టేబుల్ పోస్టుల్లో రికమెండేషన్‌లు, పొరపాట్లకు తావు లేకుండా టెక్నాలజీని ప్రవేశపెట్టాం’ అని నియామకపత్రాల పంపిణీలో చెప్పారు.