News August 23, 2025

BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్

image

BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోలా ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో గ్రామ, గ్రామాన పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని కోలా ఆనంద్ పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

నిజామాబాద్‌లో 13.2°C ఉష్ణోగ్రత

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 13.2°C, సాలూరాలో 13.2, చిన్న మావంది 13.5, ఏర్గట్ల 14.0, మెండోరా 14.1, మంచిప్ప 14.4, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ 14.5, బాల్కొండ, వేంపల్లి 14.6, మదన్ పల్లె 14.7, గోపన్న పల్లి 14.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 19, 2026

RR: 5 విడతల్లో సర్పంచ్‌లకు శిక్షణ

image

ఈ నెల19 నుంచి 23 వరకు నూతన సర్పంచ్‌లకు మొదటి విడతలో శిక్షణను ఇవ్వనున్నారు. మొదటి విడతలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 2వ విడతలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, 3వ విడతలో కందుకూరు, నందిగామ, మహేశ్వరం, కేశంపేట, 4వ విడతలో ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, 5వ విడతలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, శంషాబాద్ సర్పంచ్‌లకు ఇవ్వనున్నారు.

News January 19, 2026

రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

image

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.