News March 27, 2024
వాలంటీర్లపై ఈసీకి బీజేపీ విజ్ఞప్తి

AP: వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికలయ్యే వరకు పెన్షన్ విషయంలో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. మరోవైపు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై జిల్లా కలెక్టర్లు వేటు వేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 9, 2026
దీపారాధన తర్వాత కాలిన వత్తులను ఏం చేయాలి?

దీపం వెలిగించిన తర్వాత కాలిన వత్తులను, ఆ బూడిదను పవిత్రంగా భావించాలి. వీటిని ఎప్పుడూ చెత్తబుట్టలో, అపవిత్ర ప్రదేశాలలో పారేయకూడదు. 10 రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజున కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. చివరగా మిగిలిన బూడిదను శుభకార్యాలకు వెళ్లే ముందు తిలకంలా ధరించవచ్చు. మొక్కల మొదట్లో వేస్తే మంచి జరుగుతుంది. వాటిని అపవిత్రం చేయకూడదు.
News February 9, 2026
కల్తీ నెయ్యి వ్యవహారం.. కేసు నమోదు చేసిన ఈడీ

AP: తిరుమల కల్తీ నెయ్యి <<18933854>>వ్యవహారం<<>>లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణల నేపథ్యంలో ED రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ECIR) నమోదు చేసింది. ₹235 కోట్ల అక్రమాలు జరిగాయని, ₹20 కోట్లకు పైగా హవాలా జరిగిందని ఛార్జ్‌షీట్‌లో CBI పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ముడుపులు అందుకున్న వారికి, ఏజెంట్లకు త్వరలో ED నోటీసులు జారీచేసే అవకాశం ఉందని సమాచారం.
News February 9, 2026
394 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


