News April 1, 2024
రాహుల్ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ వ్యాఖ్యలపై ఈసీకి BJP ఫిర్యాదు

లోక్‌సభ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ‘ఎన్నికల సంఘంలో కేంద్రం తమ మనుషుల్ని మోహరించిందని రాహుల్ అన్నారు. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోలేదని మాట్లాడారు. ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారని ఆరోపించారు’ అని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
Similar News
News February 17, 2026
గద్వాల్: అదృష్టం ఆమెదే.. ఊహించని మున్సిపల్ ఛైర్ పీఠం!

వడ్డేపల్లి మండలంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. ప్రధాన పార్టీలు ఆశించిన గెలుపు దూరమైతే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10 వార్డుల్లో 8 చోట్ల గెలిచి మెజారిటీ సాధించింది. బీసీ జనరల్ రిజర్వేషన్ కింద ఛైర్మన్ పదవి ఉండటం, 4వ వార్డు నుంచి గెలిచిన సామాన్య మహిళ మంజుల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆమె కేవలం ఏడు వరకే చదివారు. కలలో కూడా అనుకోలేదని పెద్ద బాధ్యత దక్కిందని ఆమె అన్నారు.
News February 17, 2026
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’తో సాగులో మరిన్ని లాభాలు

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


