News February 8, 2025
ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. లీడింగ్‌లో ఆ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 38 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ 25 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.
Similar News
News February 19, 2026
వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
News February 19, 2026
5,349 పోస్టులకు నోటిఫికేషన్

<
News February 19, 2026
మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్

TG: వచ్చే నెల 15వ తేదీలోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో AICC పెద్దలతో రాష్ట్ర మంత్రులు, కీలక నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది. రాజగోపాల్ రెడ్డి అంశంపైనా చర్చించాం. త్వరలో ఆయనతో మాట్లాడతాం. రాజ్యసభ అభ్యర్థులపై 2 రోజుల్లో మళ్లీ చర్చలు జరుగుతాయి’ అని వెల్లడించారు.


