News March 26, 2024
పంజాబ్‌లో బీజేపీ సింగిల్‌గానే!

పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుందని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ ఝక్కర్ ప్రకటించారు. శిరోమణి అకాలీ దళ్‌తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోవట్లేదని.. మొత్తం 13 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అకాలీ దళ్, BJP మధ్య పొత్తు ఉండొచ్చని ప్రచారం సాగుతున్న వేళ ఈ ప్రకటన చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. కాగా జూన్ 1న పోలింగ్ జరగనుంది.
Similar News
News February 10, 2026
చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.
News February 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాసం.. మద్దతుకు టీఎంసీ నిరాకరణ?

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఆ నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేయనున్నారు.
News February 10, 2026
‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్!

దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ వివాదంలో భాగంగా నిర్మాత వేసిన కేసు ఉపసంహరణకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. దీంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు చిత్రం వెళ్లనుంది. క్లియరెన్స్ లభిస్తే ఈ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.


