News April 13, 2024

బీజేపీ మేనిఫెస్టో రెడీ.. రేపే విడుదల

image

సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ రేపు విడుదల చేయనుంది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ‘మోదీ గ్యారంటీ: 2047 నాటికి వికసిత్ భారత్’ థీమ్‌తో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలకు ‘న్యాయ పత్ర‌’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 98 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: భీముడు ఈ వీరుడితో 27 రోజులు పోరాడతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి, వేర్వేరు దిక్కులకు పడేస్తాడు. ఈ విధంగా అస్తమించిన మహాభారత పాత్ర ఎవరిది?
సమాధానం: జరాసంధుడు
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 16, 2025

చంద్రబాబు ఇచ్చిన DSC నోటిఫికేషన్‌తో టీచర్ అయ్యా: హోంమంత్రి

image

AP: చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి ఏడాది డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హోంమంత్రి అనిత తెలిపారు. ‘చంద్రబాబు 2002లో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌తో నేను టీచర్ అయ్యాను. ఇప్పుడు ఆయన క్యాబినెట్‌లోనే మంత్రిగా ఉండటం నా అదృష్టం. పోలీసు యూనిఫామ్ పవర్ కాదు.. బాధ్యత. కానిస్టేబుల్ పోస్టుల్లో రికమెండేషన్‌లు, పొరపాట్లకు తావు లేకుండా టెక్నాలజీని ప్రవేశపెట్టాం’ అని నియామకపత్రాల పంపిణీలో చెప్పారు.

News December 16, 2025

మెస్సీ ఈవెంట్‌తో రాహుల్ మెసేజ్!

image

వరుస విజయాలు రేవంత్ రెడ్డికి జోష్, పుష్ ఇస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించడంతో సమీకరణాలు మారిపోయాయి. కొన్ని నెలల క్రితం పొసగని, హైకమాండ్ వద్ద పొగబెట్టిన నేతలు సైతం ఇప్పుడు కామ్ అయ్యారు. ఇక HYDలో మెస్సీ ఈవెంట్‌కు రాహుల్ హాజరై CM వైపే ఉన్నానని మెసేజ్ ఇచ్చారు. ఈ జోష్, పుష్‌తో పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్ మరింత స్వతంత్రంగా పనిచేసే అవకాశముంది.