News November 25, 2024
సంభాల్ హింసకు BJPదే బాధ్యత: రాహుల్ గాంధీ
UP సంభాల్ హింసకు BJPదే బాధ్యతని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అడ్మినిస్ట్రేషన్ అన్ని పక్షాల వాదనను పట్టించుకోలేదని, సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించారు. హిందూ ముస్లిముల మధ్య BJP విభేదాలు సృష్టిస్తోందన్నారు. సుప్రీంకోర్టు త్వరగా జోక్యం చేసుకోవాలని కోరారు. స్థానిక కోర్టు ఆర్డర్‌తో జామా మసీదును సర్వే చేయడానికి వచ్చిన అధికారులపై ముస్లిములు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు.
Similar News
News December 4, 2024
723 డిఫెన్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
సికింద్రాబాద్ సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సహా దేశంలోని పలు రీజియన్లలో 723 డిఫెన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్స్‌మెన్-389, ఫైర్‌మెన్-247, మెటీరియల్ అసిస్టెంట్-19, జూ.ఆఫీస్ అసిస్టెంట్-27 సహా మరిన్ని పోస్టులున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా పాసైన 18-27 ఏళ్లలోపు వారు అర్హులు. DEC 22 దరఖాస్తుకు చివరి తేదీ. వివరాలకు <
News December 4, 2024
ప్రజల తీర్పు బాధ్యతను పెంచింది: ఫడణవీస్
మహారాష్ట్ర ఎన్నికలు చారిత్రకమని ఆ రాష్ట్ర కాబోయే CM ఫడణవీస్ అన్నారు. తనను LP నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. తాజా ఎన్నికలు ‘ఏక్ హైతో సేఫ్ హై’ అని స్పష్టం చేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నానని, వారి తీర్పు తమ బాధ్యతను పెంచిందన్నారు. హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రేపు ముంబై ఆజాద్ మైదానంలో ఫడణవీస్ CMగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News December 4, 2024
పార్టీ బలోపేతంపై ఫోకస్.. జగన్ కీలక సమావేశం
AP: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు, వైసీపీ బలోపేతం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ హామీల అమలు కోసం ఆందోళనలు చేపట్టడం సహా పలు అంశాలపై జగన్ చర్చిస్తున్నారు.