News April 26, 2024
ఓటీటీలోకి ‘బ్లాక్ బస్టర్ మూవీ’

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై గాడ్ 2’. ఈ సినిమా తెలుగు వెర్షన్ OTTలోకి వచ్చేసింది. హిందీలో గత ఏడాదే అందుబాటులోకి వచ్చినా తెలుగులో మాత్రం తాజాగా రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్ కనిపించడం గమనార్హం.
Similar News
News April 16, 2026
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ వకుల్

యువతను డ్రగ్స్ రహిత సమాజం వైపు నడిపించడమే లక్ష్యంగా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిన ‘సంకల్పం’ కార్యక్రమం గురువారం చేబ్రోలులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాయని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, వ్యసనాల బారిన పడకుండా చదువుపై ఏకాగ్రత వహించాలని పిలుపునిచ్చారు.
News April 16, 2026
పంత్ ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్

RCBతో జరిగిన మ్యాచులో LSG కెప్టెన్ పంత్ ఎడమ మోచేతికి బంతి తగిలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘LSG చాలా దారుణమైన జట్టు. వాళ్ల బౌలింగ్ మాత్రమే కాస్త బాగుంది. 5 మ్యాచులు పూర్తయినా బ్యాటింగ్‌లో రాణించేలా కనిపించట్లేదు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.
News April 16, 2026
రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు నా దగ్గర టైమ్ లేదు: మృణాల్

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు ప్రస్తుతం తన వద్ద టైమ్ లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ‘ఈమధ్య నా కాలుకు దెబ్బ తగిలింది. బిజీ షెడ్యూల్ వల్ల ట్రీట్‌మెంట్ చేయించుకోలేకపోయాను. అలాంటిది రిలేషన్‌షిప్‌కు నా దగ్గర టైమ్ ఎక్కడ ఉంటుంది. ఎవరితో డేటింగ్ చేస్తున్నానన్న దానికంటే నేను చేసే పని వల్లే నాకు గుర్తింపు రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


