News February 27, 2025
BNGR: టైర్ పగిలి ఇంట్లో ఉన్న వృద్ధురాలికి గాయం..

రోడ్డుపై వెళ్తున్న వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలైన ఘటన భువనగిరిలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల వివరాలిలా.. ములుగు జిల్లా జగన్నాథపురానికి చెందిన రామలక్ష్మి బంధువుల ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News February 27, 2025
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి: ముఖేష్ కుమార్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ముఖేష్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. తార్కిక ఆలోచన పెంపొందించుకోవడం ద్వారా పరిశోధన చేయడానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ముందస్తుగా గురువారం సైన్స్ ఫొటోస్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News February 27, 2025
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేరును ఆయన బయటకు చెప్పారని వాసిరెడ్డి పద్మ 2024 నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై 72, 79 BNS కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
News February 27, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 93% పోలింగ్ నమోదు

ఖమ్మం జిల్లాలో MLC ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4089 ఓటర్లు ఉండగా 3805 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.