News April 26, 2024
వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్?

పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించిందట. అయితే సెమిస్టర్ విధానంలో పరీక్షలను నిర్వహించాలనే ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చినట్లు సమాచారం. విద్యార్థులు పరీక్షల్లో రాణించేందుకు ఈ విధానాన్ని తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 14, 2026
ఆత్మకూరు: ఆటోలోనే డ్రైవర్ మృతి

ఆత్మకూరు శివారులోని నెల్లూరు పాలెం వద్ద సోమవారం ఆటోలోనే డ్రైవర్ జమీర్(57) మృతి చెందారు. టిట్కో గృహాల్లో నివసించే ఆయన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన తర్వాత నెల్లూరు పాలెం వద్ద ఆటోలోనే విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనారోగ్యం లేదా ఎండ తీవ్రత వల్ల మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 14, 2026
శివునికి ఏ అభిషేకంతో ఏ ఫలితం వస్తుంది?

శివాభిషేకంలో వాడే ప్రతి వస్తువు ఓ ప్రత్యేక ఫలితాన్నిస్తుందని నమ్మకం. ఆవు పాలతో సౌఖ్యాలు, పెరుగుతో బలం, నెయ్యితో ఐశ్వర్యం, కొబ్బరి నీటితో సంపద, చెరకు రసంతో ధనవృద్ధి కలుగుతుందట. నీటితో పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయట. ద్రాక్ష రసంతో విజయం, పసుపు నీటితో శుభాలు, తేనెతో తేజోవృద్ది, అన్నంతో దీర్ఘాయువు, భస్మంతో పాపాలు నశిస్తాయని విశ్వాసం. ఏ అభిషేకం చేసినా, ఫలితం దక్కాలంటే మనలో నిష్కల్మషమైన భక్తి ఉండాలి.
News April 14, 2026
బీర్లను తెగ తాగేస్తున్నారు!

ఎండలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఏపీలో 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీరు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో ఆ సంఖ్య 26.11 లక్షల కేసులకు పెరిగింది. అలాగే గతేడాది APR 1-12 వరకు 8.16 లక్షల కేసులు అమ్మితే ఈసారి అదే సమయంలో 9.2 లక్షల కేసులను విక్రయించారు. అటు <<19296712>>తెలంగాణలోనూ<<>> బీర్ల అమ్మకాలు 40 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.


