News March 26, 2024
వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు

AP: వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతూ శ్రీకాళహస్తి TDP అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన <<12923028>>వ్యాఖ్యలు<<>> ఆయన వ్యక్తిగతమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలను కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని మేం సమర్థించం’ అని చెప్పారు.
Similar News
News February 18, 2026
కర్నూలు: ఒక్క నిమిషం ఆలస్యమైనా..

కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ్ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. గేట్ క్లోజర్ సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
News February 18, 2026
ఇండియా Vs సౌతాఫ్రికా.. అన్నదమ్ముల పోరు!

T20 WC <<19168527>>సూపర్-8<<>>లో భాగంగా ఈనెల 22న ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ 2 జట్లకు అన్నదమ్ములు కోచింగ్ స్టాఫ్‌గా ఉండటం గమనార్హం. SAకు అల్బీ మోర్కెల్ కన్సల్టింగ్ కోచ్‌గా, INDకు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ వ్యవహరిస్తున్నారు. ‘ఈ మ్యాచ్ విషయంలో మా ఇద్దరి కంటే అమ్మ ఎక్కువగా ఆందోళన చెందుతోందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే IND, SAలో ఎవరికి మద్దతివ్వాలో ఆమెకు తెలియట్లేదు’ అని అల్బీ చెప్పారు.
News February 18, 2026
హెయిర్ వాష్ 2 సార్లు చేసుకోవాలా?

తల స్నానం చేసినప్పుడు డబుల్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘మొదటి వాష్‌తో మురికి, ఆయిల్, చెమట, కాలుష్యంతో పేరుకుపోయిన పదార్థాలు, చుండ్రు తొలగిపోతాయి. రెండో వాష్‌తో షాంపూ మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. తల శుభ్రంగా ఉండటంతో అందులోని ప్రోటీన్లు నేరుగా చొచ్చుకెళ్తాయి. తల చర్మం, జుట్టు మరింత దృఢంగా మారుతాయి‘ అని అంటున్నారు.


