News March 31, 2024

బోరు బండ్ల హోరు వినిపిస్తోంది: కేసీఆర్

image

TG: పల్లెల్లో బోరు బండ్ల హోరు వినిపిస్తోందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ‘గత ఎనిమిదేళ్లు బోరు బండ్లు కనపడలేదు. ఇప్పుడు లక్షల ఎకరాల పంటలు ఎండుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టట్లేదు. అసత్య ప్రచారాలు చేయడమే వారికి పనిగా మారింది. రాజకీయాలు చేద్దాం. మేమూ పదేళ్లు అధికారంలో ఉన్నాం. అధికారం వస్తుంది.. పోతుంది. అది గొప్ప విషయం కాదు. రైతులు ముఖ్యం’ అని కేసీఆర్ తెలిపారు.

Similar News

News February 9, 2026

ట్రేడ్ డీల్‌లో రైతాంగానికి రక్షణ: అమూల్ చీఫ్

image

USతో ట్రేడ్ డీల్‌తో వ్యవసాయ రంగానికి <<19081420>>నష్టం కలుగుతుందని<<>> రైతు సంఘాలు ఆందోళన చెందుతుండటం తెలిసిందే. అయితే ఈ డీల్ రైతులు, వ్యవసాయ రంగానికి రక్షణ కల్పిస్తుందని అమూల్ చీఫ్ జయన్ మెహతా తెలిపారు. ‘వాణిజ్య చర్చలనేవీ ఎప్పుడూ రెండు వైపులా జరిగే విషయాలు. DDGS వంటి పశువుల దాణాను డీల్‌లో చేర్చినంత మాత్రాన ఎలాంటి నష్టం కలగదు. DDGS వాడకం చాలా తక్కువ. పాడి, వ్యవసాయ రంగంపై ఆందోళన అవసరం లేదు’ అని చెప్పారు.

News February 9, 2026

బాలీవుడ్ హీరో స్టైల్‌లో బిల్డప్ ఇచ్చి.. అడ్డంగా దొరికిన నకిలీ IT ఆఫీసర్

image

బాలీవుడ్ హీరో స్టైల్‌లో ట్రేడర్లను బురిడీ కొట్టించాలని చూసిన ఓ నకిలీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్‌సింగ్ చౌహాన్ (51) సూరత్‌లోని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సీనియర్ IT అధికారిగా బిల్డప్ ఇస్తూ ₹30లక్షలు డిమాండ్ చేసి ₹4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న హోటల్‌కు క్యాష్‌తో రమ్మన్నాడు. అయితే సదరు ట్రేడర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News February 9, 2026

ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

image

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్‌ జోన్‌లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్‌ఫెక్షన్‌, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.