News June 21, 2024

బుమ్రా విషయంలో బౌలింగ్ కోచ్ జోక్యం చేసుకోరు: అక్షర్

image

టీమ్‌ఇండియా పేస్ గన్ బుమ్రా విషయంలో బౌలింగ్ కోచ్ కూడా పెద్దగా జోక్యం చేసుకోరని సహచర బౌలర్ అక్షర్ పటేల్ వెల్లడించారు. బుమ్రాకు మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసని అన్నారు. బౌలింగ్ కోచ్ కూడా ఎక్కువ ఇన్‌పుట్స్ ఇచ్చి అతడిని అనవసరంగా గందరగోళానికి గురిచేయరని పేర్కొన్నారు. బుమ్రాను తన వ్యూహాలకు అనుగుణంగానే బౌలింగ్ చేయమని ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చారు.

Similar News

News January 21, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 21, 2026

మా వైఖరిలో మార్పు లేదు: బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

image

ICC T20WC మ్యాచ్‌లు భారత్‌లో ఆడేదే లేదని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరామని చెప్పారు. BCCI ఒత్తిడితో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అంగీకరించబోమన్నారు. తాము తప్పుకుంటే స్కాట్లాండ్‌ను చేర్చుతారన్న వార్తలను కొట్టిపారేశారు. గతంలో పాకిస్థాన్ భారత్‌కు రాకపోతే వేదిక మార్చారని గుర్తు చేశారు.

News January 21, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 21, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.