News July 6, 2024
ఆ రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న సాలకట్ల ఆణివార ఆస్థాన పర్వదినం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని పేర్కొంది.
Similar News
News December 17, 2025
సన్‌రైజర్స్.. ఈసారి 300 పక్కానా!

IPLలో విధ్వంసకర జట్టుగా పేరొందిన SRH మరింత బలంగా మారింది. నిన్నటి మినీ వేలంలో హిట్టర్లు లివింగ్‌స్టోన్, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్‌ను కొనుగోలు చేసింది. ఇప్పటికే అభిషేక్, హెడ్, క్లాసెన్, ఇషాన్‌తో టాప్ ఆర్డర్ శత్రుదుర్భేద్యంగా ఉంది. లివింగ్‌స్టోన్, కార్స్, ఎడ్వర్డ్స్, నితీశ్ రెడ్డితో మిడిల్ ఆర్డర్ పటిష్ఠమైంది. దీంతో గత IPLలో మిస్సైన 300 స్కోర్ ఈసారి పక్కా అని SRH ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 17, 2025
మామిడి లేత పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మామిడిలో పంట పూత మొగ్గ, లేత పూత దశలో తేనె మంచు పురుగులు మరియు బూడిద తెగులు ఆశిస్తాయి. ఇవి పంటకు నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ లేదా బ్యూప్రోఫెజిన్ 2 మి.లీతో పాటు వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రా లేదా మైక్లోబుటానిల్ 1గ్రా మరియు 20 శాతం బోరాన్‌ను (లీటరు నీటికి 1 నుంచి 2 గ్రాములు) కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 17, 2025
శివుడిని నేడు ఈ సమయంలో పూజించాలి: పండితులు

త్రయోదశి తిథి నిన్న 11:57PMకు ప్రారంభమైంది. రేపు తెల్లవారుజామున 2:32 వరకు ఉంటుంది. నేడు సూర్యోదయ సమయానికి త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి ప్రదోష పూజ ఈరోజే చేయాలి. ఈ వ్రతానికి సాయంత్రం 5:45 నుంచి 8:20 వరకు అనుకూల సమయం అని పండితులు చెబుతున్నారు. ఈ 2 గంటల 35 నిమిషాల వ్యవధిలో శివుడిని ఆరాధించడం వలన బుధుడి అనుగ్రహం కూడా లభించి బుద్ధిబలం, వ్యాపార విజయం వంటి శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.


