News April 14, 2024

సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్

image

AP: నేడు కొనసాగాల్సిన మేమంతా సిద్ధం యాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరామం ప్రకటించారు. గాయం తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను నేడు వైసీపీ వెల్లడించనుంది. ప్రస్తుతం జగన్ కేసరపల్లి క్యాంప్‌లో బస చేస్తున్నారు. మరోవైపు జగన్‌పై దాడి ఘటనపై నివేదిక పంపాలని సీపీని ఈసీ ఆదేశించింది.

Similar News

News December 13, 2025

వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News December 13, 2025

2026లో ఉద్యోగాల జాతర.. RRB క్యాలెండర్ విడుదల

image

2026 ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. జులైలో పారామెడికల్, జేఈ, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు ఉండనున్నాయి.

News December 13, 2025

కస్టమ్స్‌ కమిషనర్ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోచిలోని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ట్రేడ్స్‌మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: taxinformation.cbic.gov.in/