News January 14, 2025
BREAKING: అప్పుడే పుట్టిన శిశువును పడేసిన తల్లి

సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఏ తల్లి కన్నదో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువును చూసి స్థానికులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2025
ADB: 7ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వట్లేదని వాపోయిన యువతులు

స్టాఫ్ నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉట్నూర్, గాదిగుడా నుంచి బాధితులు శైలజ, విజయలక్ష్మి, నీల ప్రజావాణికి వచ్చారు. అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి విన్నవించారు. ట్రైనింగ్ పూర్తి చేసి 7 సంవత్సరాలు అవుతుందన్నారు. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకున్నా తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు.
News February 11, 2025
ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్‌కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
News February 11, 2025
ADB: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన జర్నలిస్ట్

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులగం దేవిదాస్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.