News March 15, 2025

BREAKING: ఉప్పల్ సమీపంలో రోడ్డుప్రమాదం 

image

డీసీఎం, బైక్ ఢీకొనటంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉప్పల్ భగాయత్ పరిధి ఫైర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు భగాయత్ మీదుగా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తూ వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Similar News

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.

News February 11, 2026

తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

image

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

News February 11, 2026

మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.