News August 21, 2025
BREAKING: ‘గో బ్యాక్ మార్వాడీ’.. రేపు కొండమల్లేపల్లి బంద్

స్థానిక వ్యాపారులపై రాజస్థాన్, గుజరాత్ మార్వాడీ వ్యాపారులు అరాచకాలు చేస్తున్నారని ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ‘మార్వాడీ హటావో..తెలంగాణ బచావో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కొండమల్లేపల్లి వ్యాపార అసోసియేషన్ నాయకులు ఈరోజు తెలిపారు.శుక్రవారం వ్యాపార సముదాయాలన్నీ సంపూర్ణ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, ‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
Similar News
News January 23, 2026
మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News January 23, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News January 23, 2026
వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.


