News October 7, 2025
BREAKING: నల్గొండలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

నల్గొండ జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థిని లావణ్య దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. డైట్ కాలేజీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఉలికిపాటుకు గురిచేసింది. ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, నిందితుడైన ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ గౌడ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 23, 2026
ఉత్తమ్‌పై CM నిఘా అని వార్తలు.. మంత్రి క్లారిటీ

TG: CM రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి, ఉత్తమ్‌పై నిఘా పెట్టి దావోస్ వెళ్లారని ఓ SM పేజ్‌లో వచ్చిన వార్తపై ఉత్తమ్ కుమార్ స్పందించారు. అందులో అసలు నిజం లేదని పేర్కొన్నారు. ఆ వార్త సారాంశం ఏంటంటే.. ‘మంత్రులు vs CM పంచాయితీ హైకమాండ్‌కు చేరింది. మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్‌ను 12మంది MLAలు కలిశారు. CM ఇద్దరు మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి వెళ్లారు’ అని వచ్చిన వార్తను మంత్రి ఖండించారు.
News January 23, 2026
మేడారం జాతరకు మంచిర్యాల నుంచి ప్రత్యేక రైలు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే భక్తులకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. రైలు నం.07496 మంచిర్యాల నుంచి సికింద్రాబాద్ వరకు ఈనెల 28,29,30, ఫిబ్రవరి 1 వరకు రైలు నడుస్తుందన్నారు. స్పెషల్ రైలు మధ్యాహ్నం 3:30కి మంచిర్యాలలో బయలుదేరి రాత్రి 10:10 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరక వెళ్లే భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 23, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 23, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


