News August 14, 2025

BREAKING.. నల్లగొండ: పోక్సో నింధితుడికి ఉరి శిక్ష

image

నల్లగొండలో పోక్సో ఇన్‌ఛార్జి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మహమ్మద్ ముక్రంకు ఉరి శిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు.

Similar News

News March 13, 2026

పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్‌రైజర్స్‌కు షాక్!

image

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్‌ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్‌లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్‌లో SRH మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.

News March 13, 2026

పచ్చి ఆకు ఎరువుతో కలిగే ప్రయోజనాలు

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.

News March 13, 2026

KMM: ఉన్నోళ్లకే పట్టాలు.. లేనోళ్లకు కన్నీళ్లు..!

image

వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలనే CM ఆశయాన్ని అధికారుల నిర్లక్ష్య వైఖరి నీరుగార్చుతోంది. లబ్ధిదారుల ఎంపికలో వెలుగులోకి వచ్చిన అనర్హుల వివరాలు జిల్లా మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇప్పటికే ఇల్లు, ఆస్తులు ఉన్నవారు, ఆభరణాలు ధరించినవారు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఖరీదైన కార్లలో వచ్చారట. ఈ విషయం నిఘావర్గాల విచారణలో వెల్లడికావడం నిరుపేద కుటుంబాల్లో ఆగ్రహం తెప్పిస్తోంది.