News March 5, 2025
BREAKING.. పెద్దపల్లి: సార్ వద్దంటూ.. విద్యార్థుల ధర్నా

పెద్దపల్లి మండలం నిట్టూరు జిల్లా పరిషత్ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయుడు వద్దంటూ విద్యార్థులు ధర్నా చేశారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయుల మధ్య వచ్చిన గొడవ విద్యార్థులకు అంటకడుతూ పాఠాలు బోధించకుండా కుల వివక్ష చూపుతున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ధర్నా చేపట్టారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కనీసం స్పందించని పరిస్థితి ఉందని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News December 17, 2025
నేడే మూడో విడత పోలింగ్

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.
News December 17, 2025
గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.
News December 17, 2025
ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>


