News November 11, 2024

BREAKING బాసర IIITలో విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లా బాసర IIITలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకుంది. కాగా స్వాతి ప్రియ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పేర్కిట్. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 3, 2024

ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్సులు

image

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్స్ లను ప్రభుత్వం కేటాయించింది. ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన అంబులెన్స్ లను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ఐదు అంబులెన్స్లను ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, ఇచ్చోడ, తాంసి మండలాలకు అధికారులు కేటాయించారు.

News December 2, 2024

నృత్య ప్రదర్శనలో నిర్మల్ చిన్నారుల ప్రతిభ

image

నిర్మల్ జిల్లా శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలను పొందారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.

News December 2, 2024

నిర్మల్: ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు

image

ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆదివారం సోన్‌లో మిరుమిట్లు గొలిపే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్టేషన్‌ను అలంకరించారు. కాగా ఈ నెల 9 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.