News November 16, 2025

BREAKING: భారత్ ఓటమి

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్‌కు ఊహించని షాక్ ఎదురైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. టీమ్ ఇండియా 93 పరుగులకే పరిమితమైంది. దీంతో RSA 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 16 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మెడనొప్పితో గిల్ సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్‌కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లతో సత్తా చాటారు.

Similar News

News January 16, 2026

బ్యాన్ ఉన్నా.. ప్రాణాలు తీస్తోంది

image

భారత్‌లో 2017లోనే చైనా మాంజా వినియోగం, తయారీపై NGT బ్యాన్ విధించింది. అయినా ఏటా సంక్రాంతి వేళ దేశంలో పదుల సంఖ్యలో <<18869437>>ప్రాణాలు<<>> తీస్తోంది. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అధిక ధరలకు విక్రయించొచ్చని ఢిల్లీ, హరియాణాలో ఎక్కువగా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇకనైనా కేంద్రం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

News January 16, 2026

ధురంధర్ నటికి చేదు అనుభవం

image

BMC ఎన్నికల్లో ధురంధర్ నటి సౌమ్యా టాండన్‌కు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కు సెలవు పెట్టి మరీ నిన్న ఓటు వేయడానికి వెళ్లారు. అయితే అధికారులు దాల్మియా కాలేజ్‌ బూత్‌లో వివరాల్లేవని ఆమెను మరో బూత్‌కు పంపడంతో అసహనం వ్యక్తం చేశారు. ‘ఓటు వేయడం నా హక్కు, బాధ్యత. ముందే స్క్రీన్ షాట్ తీసుకున్నా.. ఈ గందరగోళం ఏంటి? అసలు లిస్ట్‌లో నా పేరుందో లేదో చూడాలి’ అన్నారు. చివరకు ఓటేశారా లేదా అనే దానిపై స్పష్టతలేదు.

News January 16, 2026

BREAKING: ఫ్లిప్‌కార్ట్‌, మీషో, అమెజాన్‌కు షాక్

image

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్‌లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.