News March 4, 2025

BREAKING: భువనగిరిలో రోడ్డెక్కిన మహిళలు

image

భువనగిరి మండలం హనుమాపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆరోపించారు. భువనగిరి-జగదేపూర్ ప్రధాన రహదారిలోని హనుమపురం చౌరస్తా వద్ద మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు. మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు తాగునీటి ఎద్దడి తీవ్రతను అరికట్టలేకపోతున్నారని వారు మండిపడ్డారు. 

Similar News

News December 15, 2025

సిల్వర్ జువెలరీ ఇలా సేఫ్

image

* మేకప్, పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాకే వెండి ఆభరణాలు ధరించాలి. లేదంటే ఆ రసాయనాలు మెరుపును తగ్గిస్తాయి. * వర్షంలో జువెలరీ తడిస్తే వెంటనే ఆరబెట్టి, పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. * కెమికల్ స్ప్రేలతో కాకుండా వెనిగర్, బేకింగ్ సోడా వంటి వాటితో వాటిని శుభ్రం చేయాలి. *జువెలరీని గాలి తగలని ప్రదేశంలోనే ఉంచాలి. ఇతర ఆభరణాలతో కలపకూడదు. జిప్ లాక్ ఉండే ప్లాస్టిక్ బ్యాగ్‌లలో భద్రపరుచుకోవాలి.

News December 15, 2025

కొత్తపేట: బాలసుబ్రహ్మణ్యం విగ్రహ శిల్పి మనోడే

image

హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రాంగణంలో లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ 7.2 అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి వడయార్‌ రాజ్‌కుమార్‌ రూపొందించారు. ప్రముఖుల విగ్రహాలు చెక్కడంలో సిద్ధహస్తుడైన రాజ్‌కుమార్‌ చేతుల మీదుగా ఇప్పటికే వేలాది శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. బాలు విగ్రహాన్ని అత్యంత సహజంగా మలిచినందుకు పలువురు ఆయనను ప్రశంసించారు.

News December 15, 2025

నల్గొండ: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం

image

నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిసెంబర్ 30 నుంచి నిర్వహించే పీజీ 3 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు నెట్ పరీక్ష ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, విజయ్, వెంకటేశ్, సుధీర్ పాల్గొన్నారు.