News December 1, 2025
BREAKING: మందమర్రిలో అన్నను చంపిన తమ్ముడు

మందమర్రి మండలంలోని సండ్రోన్ పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్నను తమ్ముడు హత్య చేశాడు. తమ్ముడు కుమార్ అన్న మెండ్రపు గోపాల్‌ను సోమవారం రాత్రి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2026
విశాఖ: ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

విద్యాహక్కు చట్టం(RTE) ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో 25% ఉచిత సీట్ల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు నిండిన పేద విద్యార్థులు మార్చి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ఆర్టీఈ ఫోరమ్ స్టేట్ కన్వీనర్ నరవ ప్రకాశ రావు తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8599 సంప్రదించాలన్నారు.
News February 16, 2026
ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బండారి అనూష

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఛైర్‌పర్సన్‌గా 45వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ఎన్నికలో ఆమెకు 27 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర సభ్యులు అనూషకు మద్దతు తెలిపారు.
News February 16, 2026
సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా నివేదిత

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ ఛైర్మన్‌గా మహమ్మద్ షఫీ ఉల్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. మంత్రి ఉత్తమ్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని నూతన పాలకవర్గం ప్రకటించింది.


