News March 7, 2025
BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్‌లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 17, 2025
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
News December 17, 2025
నాగర్‌కర్నూల్‌లో 83.1 శాతం పోలింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 83.1 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,79,464 మంది ఓటర్లకు గాను 1,49,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ జరగ్గా, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకే 77.82 శాతం పోలింగ్ పూర్తి కావడం విశేషం.
News December 17, 2025
వీర్నపల్లి సర్పంచ్‌గా జ్యోత్స్న విక్టరీ

వీర్నపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సమీప అభ్యర్థి భూత భాగ్యలక్ష్మీపై జ్యోత్స్న గెలుపొందారు. బరిలో ఏడుగురు పోటీపడగా 205 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గ్రామప్రజలందరి విజయంగా భావిస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించిన గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


