News March 7, 2025

BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

image

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్‌లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2026

VJA: బాలికతో అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌కు రిమాండ్

image

విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికతో స్కూల్ ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రిన్సిపల్ సాంబశివరావు(65)ను భవానిపురం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట గురువారం హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు భవానిపురం సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.

News March 13, 2026

ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

image

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <>’ఫ్లడ్ హబ్<<>>’లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏరియా పేరు సెర్చ్ చేయాలి. ముప్పు ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది.

News March 13, 2026

మధిర: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్‌(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.