News August 9, 2024
BREAKING: భారత్‌కు మరో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రెజ్లింగ్ పురుషుల 57కేజీల విభాగంలో ప్యూర్టో రికోకు చెందిన డేరియన్ క్రజ్‌తో జరిగిన మ్యాచులో 13-5 పాయింట్ల తేడాతో అమన్ గెలుపొందారు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. కాగా రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.
Similar News
News December 16, 2025
25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.
News December 16, 2025
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.
News December 16, 2025
రేపు క్లాట్ ఫలితాలు

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు రేపు 10AMకు విడుదల కానున్నాయి. https://consortiumofnlus.ac.in/ నుంచి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా డిసెంబర్ 7న జరిగిన పరీక్షకు దాదాపు 92వేల మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలలో UP, PG ప్రోగ్రాముల్లో సీట్లు కేటాయిస్తారు.


