News April 1, 2024
BREAKING: వాలంటీర్లకు మరో షాక్

AP: ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా.. తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.
Similar News
News February 13, 2026
ఆర్మీలో అగ్నివీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్(GD, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, డిప్లొమా అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 17.5 – 22 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు. సైట్: https://joinindianarmy.nic.in
News February 13, 2026
PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ కాంప్లెక్స్‌ను PM మోదీ ప్రారంభించారు. దీంట్లో PMOతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్‌కు సంబంధించిన ఆఫీసులుంటాయి. ఇక నుంచి PMOను సేవా తీర్థ్‌గా పిలుస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్‌కు కర్తవ్య భవన్‌గా నామకరణం చేశారు. గతంలో ఇవన్నీ సెంట్రల్ విస్టా పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉండేవి. దీనివల్ల పరిపాలనాపరమైన ఆలస్యం చోటు చేసుకునేది.
News February 13, 2026
కీలకం కానున్న MLA, MLC, MPల ఓట్లు

TG: మున్సి‘పోల్స్’ ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్మన్, మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా MLA, MLC, MPల ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభ సభ్యులు, MLCలు రాష్ట్రంలో ఎక్కడైనా తమ ఓటు వినియోగించుకొనేందుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అదే లోక్‌సభ సభ్యులు, MLAలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మున్సిపాల్టీలో మాత్రమే ఓటేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


