News April 26, 2024

BREAKING: బెయిర్‌స్టో సెంచరీ

image

IPLలో మరో సెంచరీ నమోదైంది. KKRతో మ్యాచులో పంజాబ్ బ్యాటర్ బెయిర్‌స్టో సెంచరీతో కదం తొక్కారు. అతడు కేవలం 45 బంతుల్లోనే 8 సిక్సర్లు, 8 ఫోర్లతో శతకం బాదారు.

Similar News

News April 12, 2026

కొడకండ్ల విద్యార్థినులకు 994 మార్కులు

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ జిల్లా కొడకండ్ల గురుకుల విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. వరుసగా నాలుగోసారి 100% ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌ BIPCలో M.సింధు, B.పావని 1000 మార్కులకు గాను 994 సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందినట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆయన అభినందించారు.

News April 12, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

image

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.

News April 12, 2026

అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

image

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.