News February 8, 2025

Breaking: ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు. 9 రౌండ్లు ముగిసే సరికి 252 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమె పదో రౌండులో 989 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆఖరిదైన 12వ రౌండ్ ముగిసే సరికి 3521 ఓట్ల ఆధిక్యం అందుకున్నారు. కేజ్రీ, సిసోడియా ఓడినా ఆతిశీ గెలవడం గమనార్హం.

Similar News

News February 19, 2026

ఈ నెల 28న తెలంగాణ బడ్జెట్

image

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26న సమావేశాలు ప్రారంభం కానుండగా, 28వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15 రోజుల పాటు సభను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

News February 19, 2026

మండలిలో మాటల యుద్ధం

image

AP: శాసనమండలిలో కూటమి, YCP సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. తిరుమల లడ్డూ అంశం, ఇందాపూర్ డెయిరీ TTDకి నెయ్యి సరఫరాపై చర్చకు YCP వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘హెరిటేజ్‌పై YCP తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆధారాలు తీసుకురమ్మంటే స్పందన లేదు’ అని మండిపడ్డారు.

News February 19, 2026

భారత్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం: బంగ్లా మంత్రి

image

T20 WC నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న <<19153853>>సమస్యను<<>> చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమినుల్ హక్ తెలిపారు. ‘నేను ఇండియా డిప్యూటీ కమిషనర్‌‌తో T20 WC ఇష్యూపై మాట్లాడా. మేం పొరుగు దేశాలతో క్రీడలతో సహా అన్ని రంగాల్లో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్నాం. దౌత్యపరమైన సమస్యలపై ముందే చర్చించి ఉంటే మా జట్టు WCలో ఆడి ఉండేది’ అని హక్ పేర్కొన్నారు.