News July 4, 2024

BREAKING: వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చట్టనిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించింది. ప్రతి దశలోనూ YCP తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని స్పష్టం చేసింది. పబ్లిక్‌కు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నప్పుడే కూల్చివేతలపై ఆలోచన చేయాలని తెలిపింది. 2 నెలల్లో భవన నిర్మాణ అనుమతులు అధికారులకు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది.

Similar News

News December 13, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్‌లో రూ.60కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ సిక్స్, GSDP లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
* ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.

News December 13, 2025

భారత్‌పై టారిఫ్‌లు.. ట్రంప్‌పై వ్యతిరేకత

image

భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన US అధ్యక్షుడు ట్రంప్‌పై ఆ దేశ చట్టసభలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను రద్దు చేయాలని ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, కృష్ణమూర్తి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, INDతో సంబంధాలకు నష్టమని విమర్శించారు. <<18529624>>పుతిన్-మోదీ<<>> భేటీపైనా USలో ప్రకంపనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు.

News December 13, 2025

ఒకే బిల్వ పత్రంతో ఎన్నిసార్లైన పూజ చేయవచ్చా?

image

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగంపై ఒకసారి సమర్పించిన పత్రాన్ని శుద్ధి చేసి, మళ్లీ పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో ఒక్క దళం సమర్పించినా కూడా చాలు. అది ఎంతో పవిత్రమైనది. పూజకు ప్రతిసారి కొత్త పత్రాన్నే సమర్పించాల్సిన నియమం లేదు. అదే పత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల పూజారాధన ఫలితం ఏమాత్రం తగ్గిపోదు’ అని అంటున్నారు.