News May 12, 2024
BREAKING: HYDలో స్టూడెంట్ SUICIDE

HYD ఘట్‌కేసర్ PS పరిధి ఘనపూర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒకేషనల్ కోర్సు అయిన MPHWలో మార్కులు తక్కువ వచ్చాయని మానసిక వేదనతో కాసర్ల స్వప్న(20) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తండ్రి సతీశ్ 2009లో ఘనపూర్‌లోని హ్యాపీ ఆర్ఫన్ హోంలో చేర్పించాడు. 1000కి 700 మార్కులే వచ్చాయని ఆమె సూసైడ్ చేసుకుంది. కేసు నమోదైంది.
Similar News
News December 16, 2025
డేంజర్‌లో హైదరాబాద్

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.
News December 16, 2025
HYD: భగత్‌సింగ్ వీలునామా.. విప్లవానికి అక్షరనామా

‘భగత్‌సింగ్ వీలునామా’ నవల స్వాతంత్ర్య సమరయోధుడి ఆలోచనా, త్యాగస్ఫూర్తిని గుండెను తాకేలా ఆవిష్కరిస్తుంది. విప్లవం ఆయుధాలతోనే కాదు, ఆలోచనలతోనూ సాగుతుందన్న సత్యాన్ని బలంగా చాటిందీ పుస్తకం. భగత్‌సింగ్ ఆశయాలు, సమాజ మార్పుపై ఆయన కలలు ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తాయి. యువతను ఆలోచింపజేసే ఈ రచన, దేశభక్తికి కొత్త నిర్వచనం చెబుతుంది. పాఠకుడిని లోతైన ఆలోచనలోకి నెట్టే బాధ్యతాయుత రచన. అందరూ చదవాల్సిన నవల ఇది.
News December 16, 2025
GHMC డీలిమిటేషన్.. నేడు స్పెషల్ కౌన్సిల్ మీట్

GHMC డీలిమిటేషన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఎవరిని సంప్రదించి వార్డులు పెంచారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వాలని GHMC వారం రోజుల గడువు ఇవ్వగా వెయ్యికిపైగా ఆబ్లిగేషన్స్ వచ్చాయి. వీటిపై చర్చించేందుకు నేడు బల్దియా స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు పాలకవర్గం సమాధానం ఇవ్వనుంది. ఫైనల్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.


