News March 31, 2024

BREAKING: HYD: ఫ్రెండ్‌ ఛాతిలో కత్తితో పొడిచారు..!

image

HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2026

HYD: Saturday Night.. డేటింగ్ వైబ్స్

image

మనోళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్.. ఈ Saturday Night నగరం ఫుల్ ‘డేటింగ్’ మోడ్‌లోకి వెళ్లిపోయింది. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పబ్స్‌లో DJ మోతతో యూత్ ఊగిపోతుంటే.. దుర్గంచెరువు దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్లతో లవర్స్ సందడి చేస్తున్నారు. కపుల్సే కాదు ‘సింగిల్స్’ కూడా గ్యాలెంటైన్ పార్టీలతో రచ్చ లేపుతున్నారు. పెయింటింగ్ డేట్స్, మ్యూజిక్ షోలతో సిటీ అంతా కలర్ ఫుల్‌గా మారింది. రెడ్ డ్రెస్‌ ఈ రోజు ట్రెండింగ్.

News February 14, 2026

HYD: 10 సీక్రెట్ నగరాలు ఇవే!

image

సంగారెడ్డి -నర్సాపూర్ Western Power: ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్
తూప్రాన్-గజ్వేల్ Northern Logistics: భారీ కంటైనర్ డిపోలు, ఈకామర్స్ వేర్‌హౌస్‌లు
భువనగిరి-చౌటుప్పల్ Eastern Gateway: ఎడ్యుకేషన్, కమర్షియల్ హబ్. మెట్రో రైలు ఛాన్స్
ఇబ్రహీంపట్నం-ఆమన్‌గల్ Southern Future: ‘ఫ్యూచర్ సిటీ’కి హార్ట్. ఫార్మా విలేజ్, ఏరోస్పేస్
చేవెళ్ల-జగదేవ్‌పూర్ <<19143014>>Green Luxury<<>> : కాలుష్యం లేని టౌన్‌షిప్‌లు, హై-ఎండ్ విల్లాలు

News February 14, 2026

సికింద్రాబాద్‌లో రేపు మెగా సెమీనార్

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో రేపు(ఆదివారం) ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేస్తారు.