News September 12, 2025

BREAKING.. KMR: బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా

image

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం మాచారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి సభను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

నారాయణపేట DCC సొంతూరిలో కాంగ్రెస్‌కు షాక్

image

మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మురారి కాంగ్రెస్ అభ్యర్థి రాముపై 444 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మురారికి 1,288 ఓట్లు రాగా రాముకు 844 ఓట్లు వచ్చాయి.

News December 14, 2025

పంచాయతీ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తి: కలెక్టర్ సంతోష్

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శాంతియుత వాతావరణంలో సజావుగా పూర్తయినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆదివారం మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 14, 2025

పార్వతీపురం: ‘మీ కోసం వెబ్ సైట్‌లో అర్జీలు సమర్పించవచ్చు’

image

PGRS అర్జీలను మీ కోసం వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలను సోమవారం స్వీకరిస్తామన్నారు.