News February 26, 2025

వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: శివరాత్రి పర్వదినాన వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున నగదు జమచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 83,420 మందికి రూ.50.65 కోట్లు చెల్లించింది. మొదటి విడతలో 18,180 మందికి డబ్బులు జమ చేయగా ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది.

Similar News

News November 12, 2025

సికింద్రాబాద్‌లోని NIEPMDలో ఉద్యోగాలు

image

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<>NIEPMD<<>>) 13 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, బీటెక్/PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.niepid.nic.in

News November 12, 2025

అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదు?

image

తల్లిదండ్రులు మరణించినప్పుడు పన్నెండు నెలలు సూతకం కారణంగా దీక్షను, యాత్రను విరమించాలి. ఇంట్లో నూతన శిశువు జన్మించినా లేదా స్త్రీలు ఏడో నెల గర్భవతులైనా పురుషులు దీక్ష తీసుకోకూడదు. అనుకోని అశుభాలు సంభవిస్తే దీక్ష విరమించి, తిరిగి దీక్ష చేయాలనుకుంటే 41 రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి. స్త్రీలలో 10 ఏళ్లలోపు బాలికలు, రుతుక్రమం కానివారు, రుతుక్రమం ఆగిపోయినవారు మాత్రమే దీక్షకు అర్హులు. <<-se>>#AyyappaMala<<>>

News November 12, 2025

త్వరలో ఈ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం

image

తెలంగాణలో ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచేలా త్వరలో పలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి. సిద్దిపేటలోని నర్మెట్టలో ఆయిల్ ఫెడ్, పెద్దపల్లిలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ, ఖమ్మంలో గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ, ఖమ్మంలోని కల్లూరు గూడెంలో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ, గద్వాల్‌లోని బీచుపల్లిలో ఆయిల్ ఫెడ్, ములుగులో K.N.బయోసైన్సెస్ ఫ్యాక్టరీలు AUG-2026 నాటికి ప్రారంభంకానున్నాయి.