News May 1, 2024

BREAKING: వారికి 50 ఏళ్లకే పింఛన్: చంద్రబాబు

image

AP: గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించారు. హజ్ యాత్రకు వెళ్లేవారికి రూ.లక్ష, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షలు వడ్డీలేని రుణాలు అందజేస్తామని స్పష్టం చేశారు. నూర్ బాషాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Similar News

News December 13, 2025

MECON లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<>MECON <<>>LTD) 44 Jr ఇంజినీర్, Jr ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), BBA, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/

News December 13, 2025

అతి శక్తిమంతమైన 18 కొండలు

image

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>

News December 13, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.