News April 1, 2024

BREAKING: YS షర్మిల పోటీ చేసేది ఇక్కడే

image

APలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేసింది. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా.. ఇక్కడ వైసీపీ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది.

Similar News

News February 17, 2026

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

image

కొంద‌రిలో క‌నుబొమ్మ‌లు చాలా ప‌లుచ‌గా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* క‌నుబొమ్మ‌లపై రోజూ ఆముదం నూనెను రాయ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా క‌ల‌బంద జెల్ ను క‌నుబొమ్మ‌ల‌పై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. * కొబ్బ‌రి నూనెలో రోజ్‌మేరీ నూనెను క‌లిపి క‌నుబొమ్మ‌ల‌పై మ‌ర్ద‌నా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.

News February 17, 2026

‘ఫర్టిగేషన్’తో సాగులో మరిన్ని లాభాలు

image

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News February 17, 2026

T20 WC: నేడు తేలనున్న ఆసీస్ భవితవ్యం

image

T20 WCలో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు న్యూజిలాండ్-కెనడా, 3PMకు ఐర్లాండ్- జింబాబ్వే, 7PMకు స్కాట్లాండ్-నేపాల్ తలపడనున్నాయి. కెనడాపై గెలిస్తే న్యూజిలాండ్ S-8కు వెళ్లనుంది. మరోవైపు ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. స్కాట్లాండ్, నేపాల్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పటిదాకా ఇండియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక S-8కు అర్హత సాధించాయి.