News May 7, 2025
BREAKING: కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు 10వేల మందితో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గుట్ట చుట్టూ వేట కొనసాగిస్తున్నాయి. మావో అగ్ర నేతలు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. 3 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుండటంతో కొందరు జవాన్లకు వడదెబ్బ తగలడంతో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమని మావోలు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News February 18, 2026
హోలీ కానుకగా డీఏ పెంపు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ(మార్చి 4) కానుకగా DA పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 58% ఉండగా మరో 2% పెరగొచ్చని అంచనా. ఇది JAN నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఒక శాతం డీఏ పెరగ్గా, ఈ ఏడాది పెంపు రెండో అత్యల్పం అవుతుంది. 2007, 2018, 2025లోనూ రెండు శాతమే నమోదైంది. కాగా <<18718812>>8వ వేతన సంఘం<<>> ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
News February 17, 2026
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

TG: HYD, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మార్చి చివరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ‘నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాల్లో 5-10 అంతస్తుల్లో గృహాల నిర్మాణానికి యోచిస్తున్నాం. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకూ అర్హులను ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.
News February 17, 2026
కనిపించిన నెలవంక.. రేపటి నుంచే రంజాన్

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మతపెద్దలు తెలిపారు. రంజాన్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం ఉద్యోగుల పనివేళల్లో వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే.


