News March 5, 2025
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నానుడిని పక్కా ఫాలో అవుతున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్ స్నేహంగా మెలిగారు. మోదీ స్ట్రాంగ్ అని, అద్భుతంగా చర్చలు జరుపుతారని ప్రశంసలు కురిపించారు. అయితే దేశం వరకు వచ్చేసరికి ట్రంప్ మావ అస్సలు తగ్గట్లేదు. ఇండియా తమ దేశంపై 100%కు పైగా ఆటో టారిఫ్‌లు విధిస్తోందని, ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే <<15656615>>వసూలు<<>> చేస్తామని బాంబు పేల్చారు.
Similar News
News December 13, 2025
రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.
News December 13, 2025
నెలలో జరీబు భూముల సమస్యల పరిష్కారం: పెమ్మసాని

AP: అమరావతిలో జరీబు భూముల సమస్యల పరిష్కారానికి నెల సమయం కోరామని కేంద్ర మంత్రి P.చంద్రశేఖర్ తెలిపారు. సాయిల్ టెస్ట్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘రాజధాని గ్రామాల్లో శ్మశానాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్‌లో ఇప్పటికీ 2,400 ఎకరాలను కొందరు రైతులు ఇవ్వలేదు. వారితో మరోసారి చర్చిస్తాం. భూసమీకరణ కుదరకపోతే భూసేకరణ చేస్తాం’ అని పేర్కొన్నారు.
News December 13, 2025
పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్‌గా ధురంధర్ మూవీ ₹300+Cr <<18544001>>కలెక్షన్లు<<>> సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.


