News May 7, 2025
BRSపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఉత్తమ్ BRSపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘BRS నేతలకు సిగ్గు ఉండాలి, కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాం అని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. NDSA నివేదిక చూసి సిగ్గుపడాలి, మీరే డిజైన్ చేశారు, మీరే కట్టారు, మేడిగడ్డ సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయి.. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు’ అని మండిపడ్డారు.
Similar News
News February 13, 2026
రామగుండం కార్పొరేషన్ ‘హస్త’గతం

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 60 డివిజన్లలో 38 స్థానాలను కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా, ఏఐఎఫ్‌బీ 6 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబరాలు మిన్నంటాయి.
News February 13, 2026
ఖమ్మం జిల్లాలో ఏ పార్టీ.. ఎన్ని వార్డులు గెలిచిందంటే?

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గెలిచిన పార్టీల వివరాలిలా..
☆ 1) ఏదులాపురం(32 వార్డులు).. కాంగ్రెస్-24, BRS-2, CPM-2, CPI-3, ఇండిపెండెంట్(IND)-1
☆ 2) వైరా(20).. కాంగ్రెస్-12, BRS-5, CPM-1, CPI-1, IND-1
☆ 3) సత్తుపల్లి(23).. కాంగ్రెస్-17, BRS-6
☆ 4) కల్లూరు(20).. కాంగ్రెస్-12, BRS-7, IND-1
☆ 5) మధిర(22).. కాంగ్రెస్-18, BRS-1, IND-3.
News February 13, 2026
NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


