News April 20, 2024

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: షబ్బీర్

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20మంది తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ చెప్పింది అబద్ధం. వాళ్ల ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మధ్యలో డ్రాప్ అవుతారు. అందుకే ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ అవుతుంది. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన హెచ్చరించారు.

Similar News

News December 5, 2025

FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

image

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.

News December 5, 2025

అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి

image

అమెరికాలోని బర్మింగ్‌హోమ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో చదివే 10 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News December 5, 2025

DOB సర్టిఫికెట్లపై ఆ ప్రచారం ఫేక్: PIB

image

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను PIB Fact Check ఖండించింది. వాట్సాప్‌లో వైరలవుతోన్న ఈ సమాచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ లేదా గడువును జారీ చేయలేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేయొద్దని పౌరులకు సూచించింది.