News July 7, 2024

CM చంద్రబాబును కలిసిన BRS ఎమ్మెల్యేలు

image

TGలో పర్యటిస్తున్న AP CM చంద్రబాబుతో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ HYDలోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి, AP ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు.

Similar News

News December 7, 2025

నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతోందా?

image

కొంతమందికి నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. అయితే ఇది సాధారణం కాదంటున్నారు వైద్యులు. నిద్రలో నోటి నుంచి లాలాజలం కారడం కొన్ని వ్యాధులకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. సైనస్ ఇన్‌ఫెక్షన్, నిద్ర, నాడీ, గ్యాస్ట్రో సంబంధిత, దంతాలు లేదా చిగుళ్లలో సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News December 6, 2025

నెరవేరిన హామీ.. 3KM సాష్టాంగ నమస్కారాలు

image

ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరడంతో 3కి.మీ మేర సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఓ MLA ఆలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలోని ఔసా BJP MLA అభిమన్యు కొన్ని నెలల కిందట కిల్లారి గ్రామంలో పర్యటించారు. అక్కడ మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే నీలకంఠేశ్వర ఆలయానికి సాష్టాంగ నమస్కారాలతో వస్తానని మొక్కుకున్నారు. ఇటీవల ఆ ఫ్యాక్టరీ మొదలవడంతో మొక్కు తీర్చుకున్నారు. ఆ కర్మాగారంలో ఉత్పత్తయిన చక్కెరతో అభిషేకం చేశారు.

News December 6, 2025

అభిషేక్ ఊచకోత.. ఈ ఏడాది 100 సిక్సర్లు

image

విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు(36 ఇన్నింగ్స్‌లు) బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ SMATలో సర్వీసెస్‌తో మ్యాచులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఓవరాల్‌గా నికోలస్ పూరన్ గతేడాది 170 సిక్సర్లు బాదారు. ఇక ఈ ఏడాది T20ల్లో అభి 1,499 రన్స్ చేయగా వాటిలో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.