News December 6, 2025

BSBD అకౌంట్లు.. ఇక నుంచి ఫ్రీగా..

image

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు RBI గుడ్ న్యూస్ చెప్పింది.
*డిజిటల్ ట్రాన్సాక్షన్లపై నో లిమిట్
*అన్‌లిమిటెడ్ డిపాజిట్లు. నో డిపాజిట్ ఫీజు
*నెలకు 4 ఫ్రీ ATM విత్‌డ్రాలు, ఉచితంగా ATM/డెబిట్ కార్డు (వార్షిక ఫీజు లేకుండా)
*ఏడాదికి 25 చెక్ లీఫ్స్, ఫ్రీగా పాస్‌బుక్/స్టేట్‌మెంట్స్
>BSBD అంటే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. APR 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.

Similar News

News January 19, 2026

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 57 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 57 వినతులు వచ్చాయి. ఈ వినతులను కమిషనర్ కేతన్ గార్గ్ తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యం విభాగానికి 4, పట్టణ ప్రణాళిక విభాగానికి 30, ఇంజినీరింగు విభాగానికి 15, మొక్కల విభాగానికి ఒకటి వచ్చిందన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News January 19, 2026

భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

image

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.

News January 19, 2026

జియో హాట్‌స్టార్ షాక్.. పెరిగిన ప్లాన్ల ధరలు

image

జియో హాట్‌స్టార్ ప్లాన్ల ధరలను సవరించింది. జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం సూపర్, ప్రీమియం కేటగిరీల్లోని 3 నెలల, వార్షిక ప్లాన్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం వార్షిక ప్లాన్ ₹1,499 నుంచి ₹2,199కి చేరింది. మొబైల్ ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొత్తగా మొబైల్ ప్లాన్ ₹79, సూపర్ ₹149, ప్రీమియం ₹299 నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పెంపు కొత్త సబ్‌స్క్రైబర్లకు మాత్రమే.