News April 11, 2024

మండుతున్న ఆసియా.. రిస్క్‌లో 24 కోట్ల మంది పిల్లలు!

image

ఈ వేసవిలో తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన 24కోట్ల మంది పిల్లల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని యూనిసెఫ్ హెచ్చరించింది. విపరీతమైన వేడే ఇందుకు కారణమని తెలిపింది. త్వరలో రికార్డ్ స్థాయిలో ఎండలు దంచికొట్టనున్న వేళ పిల్లలు సంబంధిత వ్యాధుల బారిన పడొచ్చని, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News December 17, 2025

BIG BREAKING: MLAల అనర్హత పిటిషన్ల కొట్టివేత

image

TG: ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు సాంకేతికంగా BRSలోనే ఉన్నట్లు వెల్లడించారు. కాగా రేపు పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌పై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.

News December 17, 2025

పరిపాలనలో పవన్, లోకేశ్ భేష్: చంద్రబాబు

image

AP: డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లను సీఎం CBN అభినందించారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. నిన్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని డిప్యూటీ సీఎంకు సమాచారం అందిస్తే… అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించామని చెప్పారు. మంత్రి లోకేశ్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని కలెక్టర్ల సమావేశంలో అభినందించారు.

News December 17, 2025

APPLY NOW: HALలో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(HAL)లో 9 డిప్లొమా టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత గల వారు DEC 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మెకానికల్, ఎలక్ట్రికల్), ITI+NAC అర్హత కలిగినవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hal-india.co.in