News April 14, 2024
రేపటి నుంచి బస్సు యాత్ర: అవినాశ్ రెడ్డి

AP: రేపటి నుంచి సీఎం బస్సు యాత్ర కొనసాగుతుందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై దాడి వెనక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఘటనపై ట్రోల్స్ చేస్తున్న టీడీపీ వైఖరి కుక్క తోక వంకర అనేలా ఉందన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం జగన్‌కు భద్రతను మరింత పెంచాలని కోరారు.
Similar News
News December 8, 2025
రబీ వరి నాట్లు.. రైతులకు కీలక సూచనలు

వ్యవసాయ నిపుణుల సిఫారసు మేరకు ఎంపిక చేసుకున్న వరి రకాలకు చెందిన 21 రోజుల నారును సిద్ధం చేసిన పొలంలో మరీ లోతుగా కాకుండా పైపైన నాటుకోవాలి. నాట్లు వేసే ముందు నారు కొనలు తుంచడం వల్ల కాండం తొలుచు పురుగు గుడ్ల సముదాయాలు నాశనమవుతాయి. దీని వల్ల పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. నారుమడులలో, వెదజల్లే పొలాల్లో నవంబర్-డిసెంబరులో భారీ వర్షాలకు ఎక్కువ నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
News December 8, 2025
చలికాలంలో గర్భిణులు ఏం తినాలంటే?

వాతావరణం చల్లగా ఉండటం, జీర్ణ క్రియలు నెమ్మదిగా ఉండటం వల్ల ఈ కాలంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఈ లోపం రాకుండా ఉండాలంటే డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, విటమిన్లు, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం చిలగడ దుంప, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తినాలంటున్నారు.
News December 8, 2025
‘వందేమాతరం’.. చర్చ ఈ అంశాలపైనే!

ఇవాళ పార్లమెంటులో జాతీయ గేయం ‘వందేమాతరం’పై చర్చ జరగనుంది. ఇప్పటివరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం 1875 నవంబర్ 7న లిటరరీ జర్నల్ బంగదర్శన్‌లో ప్రదర్శించారు. 1882లో తన నవల ఆనందమఠ్‌లో దీనిని భాగం చేశారు. 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్ తొలగించిందని మోదీ ఆరోపించారు. దీంతో ఇవాళ ఏ అంశాలను చర్చలో ప్రస్తావిస్తారోనని ఆసక్తికరంగా మారింది.


