News July 4, 2024
2030కి ఫుడ్ మార్కెట్ రూ.10లక్షల కోట్లకు..

భారత్‌లో ఆహార సేవల మార్కెట్ ₹5.5L cr ఉండగా, 2030కి ₹10L crకు చేరొచ్చని స్విగ్గీ-బెయిన్ సంయుక్త నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 32-34 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఆరేళ్లలో 43-45 కోట్లు చేరొచ్చని తెలిపింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వాటా 12 నుంచి 20 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. ఇప్పుడు 70% వాటా 50 నగరాల నుంచే వస్తుండగా, రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వృద్ధి నమోదుకావొచ్చని పేర్కొంది.
Similar News
News December 12, 2025
రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.
News December 12, 2025
అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం

AP: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News December 12, 2025
నేడు అనఘాష్టమి వ్రతం ఆచరిస్తున్నారా?

మార్గశిర బహుళ అష్టమి అయిన నేడు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దత్తాత్రేయుడి రూపమైన అనఘ స్వామిని, ఆయన అర్ధాంగి అనఘా దేవిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. అష్టసిద్ధులు గల సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు. ఈ పూజను రాముడు, ధర్మరాజు చేశారని నమ్మకం. అనఘాష్టమి పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


